Electric SUV: భారత్లో బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV 1 y ago
చైనా కంపెనీ BYD కొత్త ఎలక్ట్రిక్ కారు సీలియన్ 7 ని ఇండియాలో విడుదల చేసింది. రూ.48.90 లక్షల నుండి దీని ధర మొదలవుతుంది. హైఎండ్ వేరియంట్ ధర రూ.54.90 లక్షలు. బుకింగ్ కొరకు రూ.70వేలు చెల్లించవలసి ఉంటుంది. ఇదివరకే ఈ కంపెనీ అట్టో, ఈమ్యాక్స్ 7, సీల్ కార్లను విడుదల చేసింది.. ఇది నాల్గవది. దీనిలో పెద్ద స్క్రీన్, మంచి సౌండ్ సిస్టం లాంటి చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 82.56 కిలోవాట్అవర్ బ్యాటరీతో వస్తోంది. ఇది RWD, AWD వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది. సీలియన్ 7 ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.